ఓం సాయి రామ్
ఈ పుస్తకం మొదలు పెట్టె ముందు నేను సాయి నాధునికి పూర్తిగా సమర్పించుకుంటున. నన్ను ఈ పుస్తకం వ్రాయడానికి ప్రేరేపించి నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయి బాబా కి నా కృతఙ్ఞతలు. నేను నిమ్మిత్తమాత్రురాలు, నా ద్వారా బాబా నే ఈ పుస్తకం వ్రాశి వారు చెప్పాలి అనుకున్నది ప్రజలకి చెపుతున్నారు. ఓం సాయి నాధాయ నమః సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
వినాయక శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ ।
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।।
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
నియమాలు
విధానం
బాబా పలుకులు
ప్రార్థనం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే |
ఫలశ్రుతి
ఈ పుస్తకం పఠిస్తూ సాయి బాబా కి సర్వస్యశరణాగతి వేడిన వారి కోరికలు తీరును. వారి సందేహాలు తీరి బాబాపై ఎనలేని భక్తి కలుగుతుంది. బాబా పై పూర్తి భారం వేసి ఎటువంటి సంకోచాలు లేకుండా శ్రద్ధ సబూరీ తో ఈ పూజ చేసినవాళ్లకి తప్పక బాబా అనుగ్రహం కలుగుతుంది బాబా వారిని అన్ని కష్టాలనించి కాపాడతారు. ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం సాయి నమో నమః
శ్రీ సాయి నమో నమః
జై జై సాయి నమో నమః
సద్గురు సాయి నమో నమః
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతమ్|
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||
సాయి గాయత్రీ మంత్రం
ఓం షిర్డీ వసాయ విడమహే
సచిదానందయా ధీమహే
తన్నో సాయి ప్రచోదయాత్
ఈ పుస్తకం మొదలు పెట్టె ముందు నేను సాయి నాధునికి పూర్తిగా సమర్పించుకుంటున. నన్ను ఈ పుస్తకం వ్రాయడానికి ప్రేరేపించి నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయి బాబా కి నా కృతఙ్ఞతలు. నేను నిమ్మిత్తమాత్రురాలు, నా ద్వారా బాబా నే ఈ పుస్తకం వ్రాశి వారు చెప్పాలి అనుకున్నది ప్రజలకి చెపుతున్నారు. ఓం సాయి నాధాయ నమః సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
వినాయక శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ ।
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।।
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
నియమాలు
- ఉపవాసం చేయరాదు. బాబా ఉపవాసం ఎప్పుడు బోధించలేదు ఇంకా వొద్దు అని చెప్పినట్లు సత్చరిత్ర గ్రంధం ధ్వారా మనకి తెలుస్తుంది.
- ఏమైనా తిన్న తరువాతే ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టండి
- బాబా పై పూర్తి నమ్మకం ఉంచండి బాబా మీ ప్రార్ధన విని మీ కోరిక తీరుస్తారు అని నమ్మండి. ఏ ఆలోచన ఈ నమ్మకాన్ని పోగట్టనివ్వకండి
- ఆలెస్యం అవుతున్నా ఓపికతో ఉండండి. అవ్వాల్సిన సమయానికి బాబా మీ కోరిక తప్పక తీరుస్తారు
- మీ ఆలోచనలు దృష్టి పూర్తిగా బాబా పై ఉంచండి
- మీరు ఈ పుస్తకం వేరొకలికి ఇచ్చినపుడు మీరు నిర్దేశించిన నియమాలు బోదించకండి. భక్తులు వాళ్లకి ఇష్టం అయినట్లు బాబా ను ప్రార్దిస్తేనే బాబా కి ఇష్టం అనే విషయం మర్చిపోకండి
విధానం
- గురువారం ఏదైనా తిన్న తరువాత మొదలుపెట్టండి. మీ ఇచ్చానుసారం 5,7,9 లేక 11 గురువారాలు గాని మీ కోరిక తీరే వరకు గాని చేయండి
- వినాయకుని స్త్రోత్రం తొ మొదలుపెట్టండి
- సత్చరిత్ర నించి తీయబడిన బాబా పలుకులు అన్నీ గాని కుదించబడు 16 గాని చదవండి. వీటి తరువాత ఇచ్చిన కధలు శ్లోకాలు మీ సమయం ఇచ్చానుసారం చేయండి. ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం తక్కువ సమయం లో బాబా ప్రమాణాలు బోధనలు స్మరణం చేసుకోవడం
బాబా పలుకులు
- నా నామము ప్రేమతో నుచ్చరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలందు కాపాడెదను. నా కధలు వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తిశ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి శాంతి కలుగును. సాయి సాయి యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును
- భక్తుల కష్టములన్నియు నావిగనే భావించెదను. నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమముల నేను జూచెదను. ప్రపంచం లో కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్భారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణకటాక్షములు సంపాదించుటకు యత్నించుము.
- మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము. కుక్కలు, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు.
- నేను ఎప్పుడూ మీ యోగక్షేమములే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను నేను ఎప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను. నేను ఎప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే
- ఎల్లప్పుడు సాయి సాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలుపొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములుగాని, అష్టాంగ యోగములు గాని నాకు అవసరములేదు. భక్తి యున్నచోటనే నా నివాసము
- నీ యాతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధ లున్న వారైనను ఎప్పుడయితే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారీ రోగమును బాగుచేసెదరు. అందరిని ప్రేమతోను దయతోను కాపాడెదరు
- నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా నివాసస్థలము మీ హృదయమునందే గలదు.
- లోభికి శాంతి గాని, సంతుష్టిగాని, దృఢనిశ్చయముగాని యుండవు. మనస్సునం దేమాత్రము పేరాశ యున్నను సాధనలన్నియు (ఆధ్యాత్మిక ప్రయత్నములు) నిష్ప్రయోజనములు.మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు
- నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా యితరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైన ధనముకొఱకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుట కిష్టము లేకున్నచో, నీవు ఇవ్వనక్కరలేదు, కాని వానిపై కుక్కవలె మొఱగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను, నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నీశ్చయముగా నీకు సంతోషము కులుగును. భగవంతుని మార్గ మసామాన్యము; మిక్కిలి విలువైనది; కనుగొన వీలు లేనిది. వారి యిచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. మన ఋణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరి కొకరు తోడ్పడి ప్రేమించి సుఖఃముగాను, సంతోషముగాను నుందుము గాక.
- ఎవరికయితే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును
- ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను
- గతజన్మపాపము లనుభవించి, విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన కష్టములునోర్చుకొనుము. దేవుడే యార్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు, సమస్తము అర్పింపుము. అనగా సర్వస్యశరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము
- నేను ఒక రూపాయి దక్షిణ యెవరివద్దనుంచి గాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరకనే యేమి తీసికొనను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వాని వద్దనే ధనము పుచ్చుకొందును. గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని, నీ విప్పు డనుభ వించలేవు. కనుక ధనమును పొందవలెననినచో. దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటయే సరియైన మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును.
- ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియు చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యెల్లప్పుడు జపించుచుండును. ఎవరయితే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను. వారికి మోక్షము నిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరయితే నాకర్పించనిదే యేమియు తినరో అట్టివారిపై నేను ఆధారపడియుందును. ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో, వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను.
- ఎవరయితే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే బాధలనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు. మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మనదగ్గర నున్నది. ఏది యితరులదో, యది యితరులవద్ద నున్నది
- నా యందే నమ్మకముంచుము. నీ మనోభీష్టము నెరవేరును
ప్రార్థనం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే |
ఫలశ్రుతి
ఈ పుస్తకం పఠిస్తూ సాయి బాబా కి సర్వస్యశరణాగతి వేడిన వారి కోరికలు తీరును. వారి సందేహాలు తీరి బాబాపై ఎనలేని భక్తి కలుగుతుంది. బాబా పై పూర్తి భారం వేసి ఎటువంటి సంకోచాలు లేకుండా శ్రద్ధ సబూరీ తో ఈ పూజ చేసినవాళ్లకి తప్పక బాబా అనుగ్రహం కలుగుతుంది బాబా వారిని అన్ని కష్టాలనించి కాపాడతారు. ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం సాయి నమో నమః
శ్రీ సాయి నమో నమః
జై జై సాయి నమో నమః
సద్గురు సాయి నమో నమః
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతమ్|
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||
సాయి గాయత్రీ మంత్రం
ఓం షిర్డీ వసాయ విడమహే
సచిదానందయా ధీమహే
తన్నో సాయి ప్రచోదయాత్