Telugu
శ్రీసాయినాథాష్టకము
పత్రి గ్రామ సమాధ్బూతం ద్వారకామాయి వాసినం
భక్తా భీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం
మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం
జగద్దురణార్థం యో నరరూప ధరో విభుః
యోగానంద మహాత్మానం సాయినాథం నమామ్యహం
సాక్షాత్కారం జయే లాభే స్వాత్మాన్ రామో గురోర్ముఖాత్
నిర్మమం పాపఘ్న తం సాయినాథం నమామితమ్
నరసింహాది శిష్యాణాం దదౌయానుగ్రహం కురు
భవబంధాపహర్తారం సాయినాథం నమామితమ్
ధనాఢ్యాన్ చ దారిద్రాన్యః సమదృష్ట్యేవ పశ్యతి
కరుణాసాగరం దేవం సాయినాథం నమామితమ్
సమాధిస్థోపి యో భక్తా నవతీష్టార్ధదానతః
అచింతం మహిమానంతం సాయినాథం నమామితమ్
వైద్యనాథాష్టకం
శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 1 ||
గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 2 ||
భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 3 ||
ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 4 ||
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 5 ||
వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 6 ||
స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 7 ||
శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 8 ||
ఫలశ్రుతిః
బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం
ఇతి శ్రీ వైద్యనాథష్టకం సంపూర్ణం ||
కాలభైరవాష్టకం
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ || 9 ||
ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |
ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః
ఉధధిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
బుద్దిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
జయహనుమంత ఙ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ
ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధిలంఘించి లంక జేరుకొని
సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి
భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ
వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి
హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామ లక్ష్మణుల అస్త్రధాటికీ అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము
ఎదురిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగిపొరలె
సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం
రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృతపాన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న
రామ ద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
ధ్వజావిరాజా వజ్ర శరీరా భుజ బల తేజా గధాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్రా కేసరీ పుత్ర పావన గాత్ర
సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు
యమ కుబేర దిగ్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
సోదరభరత సమానాయని శ్రీ రాముడు ఎన్నిక గొన్న హానుమా
సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా
అష్టసిద్ది నవ నిధులకు దాతగ జానకీమాత దీవించెనుగా
రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసినా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర ధుఃఖ బంజన
ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
శ్రద్దగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా
భక్తిమీరగా గానము చేయగ ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ
తులసీదాస హనుమాన్ చాలిసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు
మంగళ హారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత
ఓం శాంతిః శాంతిః శాంతిః